శ్రీలంక అండర్-15 జట్టును తిప్పి పంపిన చెన్నై పోలీసులు

04-08-2014 Mon 10:50

భద్రతా కారణాల దృష్ట్యా శ్రీలంక అండర్-15 జట్టును చెన్నై నుంచి పోలీసులు తిప్పి పంపారు. లంకకు వ్యతిరేకంగా తమిళనాడులో ఇప్పటికే ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి నుంచి చెన్నైలో జరుగుతున్న జేఎం హరూన్ ఛాంపియన్ షిప్ లో లంక జట్టు ఆడేందుకు అధికారులు పర్మిషన్ ఇవ్వలేదని టోర్నమెంట్ నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలో లంక జట్టుకు ఏదైనా హాని జరగవచ్చన్న సమాచారంతో తిరిగి తమ దేశం వెళ్లిపోవాలని, జట్టు భద్రతకు తాము గ్యారెంటీ ఇవ్వలేమని తమిళనాడు పోలీసులు చెప్పారు. వెంటనే సదరు జట్టు కొలంబో పయనమై వెళ్లిపోయింది.