నేపాల్ పశుపతినాథ్ దేవాలయంలో మోడీ పూజలు

04-08-2014 Mon 10:27

నేపాల్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఖాట్మండులోని ప్రపంచ ప్రఖ్యాత పశుపతినాథ్ దేవాలయంలో ఈ ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు గంటసేపు మోడీ ఆలయంలో గడిపారు. ఈ సమయంలో అధికారులు భారీ భద్రత కల్పించారు. అనంతరం నేపాల్ అధ్యక్షుడు రామ్ బరన్ యాదవ్ తో ప్రధాని భేటీ కానున్నారు. కీలకమైన సమస్యలపై వీరిరువురూ చర్చించే అవకాశం ఉంది. నేటితో మోడీ నేపాల్ పర్యటన ముగియనుంది.