చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరిదీ పదవీ వ్యామోహమే: సీపీఐ నారాయణ

04-08-2014 Mon 08:09

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ లపై సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పదవీ వ్యామోహంలో ఉన్నారని... పదవులు కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా సాగుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే, వారిద్దరూ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల్లో విద్యుత్ సమస్య తలెత్తకుండా చూడాలని, విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజల మధ్య సఖ్యత పెరిగేలా చేయాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులపైన ఉందని అన్నారు.