కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేయండి: కాంగీయులకు రఘువీరా పిలుపు

03-08-2014 Sun 20:39

షరతుల్లేని రుణమాఫీ అమలు చేయాలంటూ రేపు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నా చేయాలని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని ధర్నాలను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఎదురుగా జరగనున్న ధర్నాలో తాను పాల్గొంటానని రఘువీరా తెలిపారు.