టీఆర్ఎస్ ప్లీనరీ ఎల్బీ స్టేడియంలో

03-08-2014 Sun 20:30

టీఆర్ఎస్ సీనియర్ నేత కేకే నివాసంలో ఆరుగంటలపాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశం ముగిసింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. గ్రేటర్ ఎన్నికల బాధ్యతలు కేకేకు అప్పగించారు. పార్టీలో గ్రేటర్ నేతల చేరికపై దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. గ్రేటర్ ను ఎలాగైనా చేజిక్కించుకోవాలని ఆయన పార్టీ నేతలకు స్పష్టం చేశారు. పార్టీ ప్లీనరీ సమావేశాలను స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పూర్తయిన తరువాత నిర్వహించాలని నిర్ణయించారు. ఎల్బీ స్టేడియంను ప్లీనరీ వేదికగా ఖరారు చేశారు.