విద్యార్థులపై కేసులు ఎత్తేస్తాం: నాయిని

03-08-2014 Sun 20:06

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం సందర్భంగా విద్యార్థులపై పెట్టిన కేసులన్నీ ఎత్తేస్తామని అన్నారు. మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నామని ఆయన తెలిపారు. అమర వీరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా అందజేయడంతోపాటు, మూడెకరాల భూమి అందజేస్తామని, అర్హులు ఉంటే వారికి ఉద్యోగం కల్పిస్తామని నాయిని తెలిపారు. పోలీసులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.