కేసీఆర్ పార్టీలో చేరమని ఆహ్వానించారు... మేమింకా నిర్ణయం తీసుకోలేదు: గట్టు

03-08-2014 Sun 19:29

టీఆర్ఎస్ పార్టీలో చేరాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించారని వైఎస్సార్సీపీ నేత గట్టు రామచంద్రరావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో వైఎస్సార్సీపీని బలోపేతం చేస్తూ టీఆర్ఎస్ తో కలిసి పని చేయాలా? లేక టీఆర్ఎస్ పార్టీలో విలీనమవ్వాలా? అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. కార్మిక చట్టాలు సమర్ధవంతంగా అమలు కావడం లేదని ముఖ్యమంత్రికి తెలిపేందుకు తాము సమావేశానికి వచ్చామని ఆయన వెల్లడించారు. కాంట్రాక్టు కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా చేయాలని ఆయన సూచించారు.