చైనాలో భారీ భూకంపం...కూలిన భవంతులు

03-08-2014 Sun 19:15

వాయవ్య చైనాలోని యున్నన్ రాష్ట్రంలో వెన్ పింగ్ సమీపంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5గా నమోదైంది. దీని ప్రభావంతో 150 మంది మృతి చెందినట్టు సమాచారం. భూకంపం ధాటికి పలు భవంతులు కూలిపోయాయి. భవనాల శిధిలాల కింద చాలా మంది చిక్కుకుపోయారు. వారిని వెలికి తీసేందుకు అధికారులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. 1970లో యున్నన్ లో సంభవించిన భూకంపంలో 15 వేలకు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అంత స్థాయిలో కాకున్నా... ప్రస్తుతం సంభవించిన భూకంపం కూడా తీవ్రమైనదే కావడం విశేషం.