రైలు భోజనంలో బొద్దింక... లక్ష జరిమానా

03-08-2014 Sun 18:43

రైళ్లలో ఐఆర్ సీటీసీ సరఫరా చేసే ఆహారంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. రుచిపచి లేదని, పరిశుభ్రంగా ఉండదని, క్వాంటిటీ తక్కువని... ఇలా చెప్పుకుంటే పోతే లిస్టు చాలా పెద్దదే. గత వారం కోల్ కతాలో రాజధాని రైలులో సరఫరా చేస్తున్న ఆహారం నాణ్యత పర్యవేక్షించిన అధికారులకు ఆహారంలో బొద్దింక కనబడింది. దీంతో లక్ష రూపాయల జరిమానా విధించారు. జూలై 23న మరో 12 రైళ్లలో తనిఖీలు నిర్వహించారు అధికారులు. వాటిలో నాణ్యత లోపించినట్టు గుర్తించడంతో ఐఆర్ సీటీసీతో పాటు తొమ్మిది క్యాటరింగ్ సెక్షన్లకు 11.50 లక్షల రూపాయల జరిమానా విధించారు.