ప్రాణం కాపాడిన స్మార్ట్ ఫోన్

03-08-2014 Sun 18:29

స్మార్ట్ ఫోన్ ఓ మనిషి నిండు ప్రాణాన్ని కాపాడింది. చైనాలో ఓ వ్యక్తికి సరుకుల సంచి దొరికింది. ఆ సంచి అమ్మేసి బీరు కొనుక్కుంటానని తన యజమానితో ఆ వ్యక్తి పరాచకాలు ఆడడం ప్రారంభించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యజమాని జేబులో తుపాకీ తీసి కాల్చేశాడు. బుల్లెట్ దెబ్బకు పిట్టలా రాలిపోయేవాడే కానీ అదృష్టవశాత్తు అది అతని జేబుపై తగిలింది. అతని జేబులో శామ్సంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ ఉంది. దానికి బుల్లెట్ తగలడంతో ఫోన్ పాడైపోయింది కానీ, ప్రాణం మాత్రం నిలబడింది. దీంతో ఫోన్ తన ప్రాణం కాపాడిందని ఆ వ్యక్తి సంబరపడ్డాడు.