పోలీసు వాహనాల డిజైన్ కి తెలంగాణ సీఎం సూచన

03-08-2014 Sun 17:34

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు పెట్రోలింగ్, ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం సమకూర్చనున్న కొత్త వాహనాల డిజైన్ రూపకల్పన పూర్తయింది. ఈ డిజైన్ ను డీజీపీ అనురాగ్ శర్మ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు చూపించారు. డిజైన్ ను పరిశీలించిన కేసీఆర్ వాహనం ముందు లోగో, అక్షరాలలో స్వల్ప మార్పులు చేయాలని సూచించారు. ద్విచక్రవాహనానికి రెండు వైపులా సైడ్ బాక్సులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి డీజీపీని ఆదేశించారు.