పార్లమెంటులో రచ్చరచ్చే: ఎంపీ సీతారాం నాయక్

03-08-2014 Sun 17:30

రాష్ట్రాన్ని విభజించినట్టే హైకోర్టును కూడా విభజించాలని టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, హైకోర్టు విభజనపై న్యాయశాఖ మంత్రి, లోక్ సభ స్పీకర్ కు రేపు నోటీసు ఇస్తామని అన్నారు. హైకోర్టు విభజనపై కేంద్రం స్పందించకుంటే పార్లమెంటును స్తంభింపజేస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత విద్యామండలి చట్టబద్ధంగా ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు.