వైఎస్సార్సీపీలో మాయమై టీఆర్ఎస్ సమావేశంలో కనబడిన గట్టు, జనక్ ప్రసాద్

03-08-2014 Sun 15:09

వైఎస్సార్సీపీలో కీలక పాత్ర పోషించిన గట్టు రామచంద్రరావు, జనక్ ప్రసాద్ లు గత కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. అకస్మాత్తుగా వీరు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలో కేకే నివాసంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల వ్యూహరచన సమావేశంలో ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడిది సర్వత్ర చర్చనీయాంశమైంది. గట్టు, జనక్ ప్రసాద్ వైఎస్సార్సీపీ అధినేత తీరుపై ఆగ్రహంతో టీఆర్ఎస్ లో చేరదల్చుకున్నారా? లేక అధినేత ఆదేశంతోనే పొత్తు కోసం సమావేశానికి హాజరయ్యారా? అనే అనుమానాలు ముసురుకున్నాయి. సమావేశం సందర్భంగా వీరిద్దరూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చలు జరపడం కూడా రాజకీయ వర్గాలను గందరగోళంలోకి నెట్టింది. సమావేశం తరువాత వీరు మీడియాతో మాట్లాడకపోవడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది.