ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి సచిన్ ఎంక్వయిరీ

03-08-2014 Sun 12:04

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై మాస్టర్ బ్లాస్టర్, భారతరత్న సచిన్ టెండూల్కర్ ఆరా తీసినట్టు ప్రచారం సాగుతోంది. విజయవాడ నగరంలో శుక్రవారం పీవీపీ స్క్వేర్ షాపింగ్ మాల్ ను సచిన్ ప్రారంభించాడు. ఈ సందర్భంగా తాను ఇరవై ఏళ్ల కిందట...1993లో ఓ ఛారిటీ మ్యాచ్ ఆడేందుకు ఇక్కడికి వచ్చానని టెండూల్కర్ గుర్తు చేసుకున్నాడు. విజయవాడ నగరంలో అప్పటికీ, ఇప్పటికీ ఉన్న మార్పులను టెండూల్కర్ పీవీపీ ప్రసాద్ దగ్గర ప్రస్తావించాడని పీవీపీ స్క్వేర్ వర్గాలు అంటున్నాయి. రాష్ట్ర విభజన తర్వాతి పరిస్థితులను, కొత్త రాజధానిగా ఏ ప్రదేశాన్ని అనుకుంటున్నారని ఆయన పిీవీపీ ప్రసాద్ ను ఎంక్వయిరీ చేసినట్టు సమాచారం. గుంటూరు జిల్లా మంగళగిరిలో సచిన్ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశాడని ఇటీవల వార్తలు వచ్చాయి. విజయవాడ, గుంటూరు మధ్యనే ఏపి రాజధాని ఏర్పాటవుతుందనే ఉద్దేశ్యంతోనే సచిన్ ఇక్కడ భూములను కొన్నాడని ప్రచారం సాగింది. అలాగే నెల్లూరులో కూడా సచిన్ భారీగా భూములు కొనుగోలు చేశాడనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ గానీ, అతని మిత్ర బృందం గానీ ఆంధ్రప్రదేశ్ లో భూముల కొనుగోలు వ్యవహారంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు