ఏపీ, తెలంగాణల మధ్య రేపు ఢిల్లీలో 'పవర్'సెటిల్ మెంట్

03-08-2014 Sun 11:14

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రేపు ఢిల్లీలో 'పవర్' పంచాయతీ జరగనుంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన విద్యుత్ వివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం ఢిల్లీలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) చైర్‌పర్సన్ నీరజా మాథూర్ నాయకత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సోమవారం ఇరురాష్ట్రాల అధికారులతో సమావేశం కానుంది. నీరజా మాథూర్ కమిటీ ప్రధానంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏపీజెన్‌కో-డిస్కమ్‌ల మధ్య కుదిరిన ఒప్పందాలపై చర్చించనుంది. రేపు జరిగే ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం తరపున జోషి... ఆంధ్రప్రదేశ్ తరపున రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి అజయ్ జైన్ హాజరుకానున్నారు.