రాహుల్ లో కసిలేదు,నాయకత్వ లక్షణాలు లేవు: నట్వర్ సింగ్

03-08-2014 Sun 09:41

'వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్' పుస్తకంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంగ్రెస్ మాజీ నేత నట్వర్ సింగ్... ఈ పుస్తకంలోని వివిధ అంశాలపై జాతీయ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన రాహుల్ గాంధీ సామర్థ్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు రాహుల్ గాంధీకి లేవని ఆయన వ్యాఖ్యానించారు. గొప్ప రాజకీయనాయకుడిగా ఎదగాలనుకునేవారు రాజకీయాలను పుల్ టైం జాబ్ గా తీసుకోవాలని... విషయపరిజ్ఞానంతో పాటు రాజకీయాల్లో రాణించాలన్న కసి కూడా ఉండాలని నట్వర్ సింగ్ వ్యాఖ్యానించారు. అయితే, ఈ రెండు లక్షణాలు రాహుల్ లో లేవని ఆయన స్పష్టం చేశారు. ఇవి లేకపోవడం వల్లే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారసారధిగా రాహుల్ పూర్తిగా విఫలమయ్యారని ఆయన అన్నారు.