ఏటీఎం మనిషి ప్రాణాలు తీసింది!

02-08-2014 Sat 22:05

ఏటీఎం ఓ వ్యక్తి నిండు ప్రాణాలు తీసింది. డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లిన మనిషి ప్రాణాలు కోల్పోవడం రాజధానిలో కలకలం రేపుతోంది. ఢిల్లీకి చెందిన శ్యాం పండిట్‌ డబ్బులు డ్రా చేసేందుకు ఓ ప్రైవేటు ఏటిఎం వద్దకు వెళ్లాడు. పిల్లలను వెలుపలే ఉంచి తాను మాత్రం ఏటీఎం లోపలకు వెళ్లాడు. అప్పుడే కురుస్తున్న వర్షంతో ఆ ప్రాంతమంతా నీరు నిలిచి పోయింది. దీంతో ఏటీఎం లోపలికి నీరు వెళ్లిపోయింది. ఈ క్రమంలో అతను షాక్ కొట్టి మృతి చెందాడు. డబ్బులు డ్రా చేయడానికి వెళ్లిన తండ్రి మృతి చెందడంతో పిల్లలు కన్నీరు మున్నీరయ్యారు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఏటీఎంను సీజ్ చేసిన పోలీసులు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం వల్లే శ్యాం పండిట్ మృతి చెందాడని అతని బంధువులు ఆరోపిస్తున్నారు.