ప్రపంచ ప్రఖ్యాత గాయని నగ్నంగా ఫోజులిచ్చింది

02-08-2014 Sat 21:57

ప్రపంచ ప్రఖ్యాత గాయని క్రిస్టినా ఆగ్యులెరా నగ్నంగా ఫొటోలకు ఫోజులిచ్చి సంచలనం సృష్టించింది. రెండో బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధంగా ఉన్న క్రిస్టినా ఆగ్యులెరా నిండు చూలాలు. 33 ఏళ్ల ఈ గాయనికి ఈసారి ఆడపిల్ల పుట్టనుందని వార్తలు షికార్లు చేస్తున్నాయి. తన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో చూపించడానికి ఆమె పూర్తి నగ్నంగా మారి 'వి' మ్యాగజైన్కు ఫొటో పోజులిచ్చిందని డైలీ మెయిల్ పేర్కొంది. తెల్లటి బ్యాక్గ్రౌండ్లో పూర్తి బ్లాక్ అండ్ వైట్లో తీసిన ఈ ఫొటోను 'వి' మ్యాగజైన్ వెబ్సైట్ ప్రచురించింది. అయితే.. నగ్నత్వంలో కూడా ఎలాంటి అసభ్యత లేకుండా ఈ ఫొటో ఉండటం విశేషం. ఎందుకిలా నగ్నంగా ఫొటో తీయించుకున్నారని ఆమెను ప్రశ్నిస్తే ''నేనో మహిళను. నా జీవితంలోని ప్రతి దశలోను నా శరీరం పట్ల నేను చాలా గర్వపడుతున్నాను. ఏమాత్రం భయం లేకుండా, ఆత్మవిశ్వాసంతో ఉన్నాను'' అని చెప్పింది. ఈ నెలలోనే ఆమె బిడ్డకు జన్మినివ్వనుంది. కాగా ఆగ్యులెరా, ఆమె భర్త మాథ్యూ రట్లర్ (28) ఇప్పుడు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఆగ్యులెరాకు ఇప్పటికే తన మాజీ భర్త జోర్డాన్ బ్రట్మన్తో ఆరేళ్ల కొడుకు మాక్స్ ఉన్నాడు.