ఈ నెంబర్ కు ఫోన్ చేయండి స్పందిస్తాం: ఓఎన్జీసీ

02-08-2014 Sat 19:50

కోనసీమలో చోటుచేసుకుంటున్న వరుస గ్యాస్ ప్రమాదాల నివారణకు ఓఎన్జీసీ నడుం బిగించింది. ప్రమాదాలపై హెచ్చరిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదంటూ స్థానికులు వేలెత్తి చూపడంపై దృష్టి పెట్టిన ఓఎన్జీసీ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది. కోనసీమలో ఎక్కడైనా గ్యాస్ ప్రమాదం జరిగే అవకాశం ఉందని అనుమానం వచ్చినా, ప్రమాదం చోటు చేసుకున్నా 1800-425-7535 నెంబర్ కు కాల్ చేయాలని ఓఎన్జీసీ సూచించింది. వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపింది.