: ముణుగూరు 'సూపర్ ఫాస్ట్' ఇకపై 'ఎక్స్ ప్రెస్ రైలు'

ఎక్స్ ప్రెస్ బస్సులను సూపర్ ఫాస్ట్ బస్సులుగా మార్చి ఆర్టీసీ ఆదాయం చేసుకుంటుంటే, అందుకు భిన్నంగా ముణుగూరు సూపర్ ఫాస్ట్ రైలును ఎక్స్ ప్రెస్ రైలుగా మార్చి ఆదాయం పెంచుకునేందుకు రైల్వేశాఖ సిద్దమైంది. మణుగూరు నుంచి సికింద్రాబాద్ వరకు, సికింద్రాబాద్ నుంచి మణుగూరు వరకు రాకపోకలు సాగిస్తున్న సూపర్ ఫాస్ట్ రైలును ఎక్స్ ప్రెస్ రైలుగా మారుస్తున్నట్టు భద్రాచంలం రోడ్ కమర్షియల్ ఇన్ స్పెక్టర్ తెలిపారు. రైలు స్థాయితో పాటు రైలు బండి నెంబర్ కూడా మారింది. మణుగూరు నుంచి సికింద్రాబాద్ వచ్చే రైలు నెంబర్ గతంలో 12751గా వుండగా, ఇప్పుడు దీనిని 17025 గా మార్చారు. అలాగే సికింద్రాబాద్ నుంచి మణుగూరు వచ్చే రైలు నెంబర్ 12752 ఉండగా, దానిని 17026 గా మార్చినట్టు అధికారులు వెల్లడించారు. సూపర్ ఫాస్ట్ ను ఎక్స్ ప్రెస్ చేయడంతో ప్రయాణ ఛార్జీలు 15 శాతం తగ్గి ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

More Telugu News