రాష్ట్రపతికి వీడ్కోలు పలికిన చంద్రబాబు, కేసీఆర్

02-08-2014 Sat 19:09

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి తిరుగు ప్రయాణమయ్యారు. బేగంపేట విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతికి సాదరంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రులిద్దరూ చిరునవ్వులు చిందిస్తూ సంభాషించడం అందర్నీ ఆకట్టుకుంది.