తప్పనిసరి పరిస్థితుల్లోనే ఉన్నత విద్యామండలి ఏర్పాటు: మంత్రి జగదీశ్వర్ రెడ్డి

02-08-2014 Sat 18:15

ఎంసెట్ కౌన్సెలింగ్ జరిపేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు తమ రాష్ట్రానికి కొత్త ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, తప్పనిసరి పరిస్ధితుల్లోనే ఈ పని చేశామని టీఎస్ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. అడ్మిషన్ల ప్రక్రియలో ఏపీ ప్రభుత్వం సహకరించకపోతే సొంతంగా అడ్మిషన్లు చేపడతామన్నారు.