న్యాయవిద్య అందరికీ అందాలి: రాష్ట్రపతి

02-08-2014 Sat 18:10

న్యాయవిద్య సామాన్యులకు కూడా అందాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిలషించారు. హైదరాబాదులోని నల్సార్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి మాట్లాడుతూ, ప్రజలు ప్రాథమిక హక్కులు వినియోగించుకునేలా చేయడం న్యాయవృత్తిలో ఉన్నవారు చూడాలని అన్నారు. ఉన్నత విద్యలో సంస్కరణలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. విశ్వవిద్యాలయాలు పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. విద్య ఉద్యోగానికే కాకుండా ప్రజలకు ఉపయోగపడితే దానికి సార్థకత ఏర్పడుతుందని ఆయన తెలిపారు. దేశంలోని ఉత్తమ విద్యాలయాల్లో నల్సార్ యూనివర్సిటీ ఒకటని ఆయన కొనియాడారు. నల్సార్ లో న్యాయవిద్య పూర్తి చేసిన విద్యార్థులకు ఈ రోజు మరువలేని రోజని ఆయన చెప్పారు.