ఆంధ్రప్రదేశ్ పోలీస్ కు 100 కోట్లు : చినరాజప్ప

02-08-2014 Sat 17:47

ఆంధ్రప్రదేశ్ పోలీస్ ను పటిష్ఠం చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఏపీ హోం మంత్రి చినరాజప్ప తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు వ్యవస్థను బలంగా తీర్చిదిద్దుతామని అన్నారు. పోలీసులకు దశలవారిగా కొత్త వాహనాలు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. నూతన వాహనాల కోసం తొలి దశలో 100 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన మేరకు కాపులను బీసీల్లో చేరుస్తామని స్పష్టం చేశారు. మంగళగిరి, కాకినాడల్లో జాతీయ విపత్తు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. 35 నియోజకవర్గాల్లో అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు.