రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన రచయిత తస్లిమా నస్రీన్

02-08-2014 Sat 17:12

కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను బంగ్లాదేశ్ రచయిత్రి తస్లిమా నస్రీన్ కలిశారు. తాను భారత్ లో ఎక్కువకాలం ఉండేందుకు వీసా గడువు పెంచాలని ఆమె మంత్రిని కోరారు. భారత్ లో నివాస అనుమతి కోసం పెట్టుకున్న దరఖాస్తుకు కేంద్ర హోంశాఖ ఈ నెల 1 నుంచి రెండు నెలల పాటు ఉండేందుకు అనుమతించింది. అయితే, దీర్ఘకాలం ఉండేందుకు ఆమె చేసిన విజ్ఞప్తిని పెండింగ్ లో ఉంచింది. ఈ నేపథ్యంలో ఆమె రాజ్ నాథ్ కలసి కోరారు. 1994లో బంగ్లాదేశ్ నుంచి స్వీయ బహిష్కరణ తర్వాత ఇండియన్ వీసా మీద 2004 నుంచి తస్లిమా ఇక్కడే ఉంటున్నారు.