శేషాచలం అడవుల్లో ఎస్టీఎఫ్ బలగాల కూంబింగ్

02-08-2014 Sat 16:38

చిత్తూరు జిల్లా గొట్టిగల్లు మండలం శేషాచలం అడవుల్లో ఎస్టీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇక్కడి బొంబాజీ కొండ వద్ద ఎర్రచందనం స్మగ్లర్లు ఎస్టీఎఫ్ బలగాలకు ఎదురుపడటంతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక ఎర్రచందనం కూలీ మరణించాడు.