సౌదీలో రోడ్డు ప్రమాదం... ఇద్దరు భారత మహిళల దుర్మరణం

02-08-2014 Sat 15:30

సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారత మహిళలు దుర్మరణం పాలయ్యారు. వీరు తమ కుటుంబాలతో దమ్మమ్ నుంచి రియాద్ తిరిగొస్తుండగా ఈ ఘటన జరిగింది. వీరు కేరళకు చెందినవారు. రియాజ్, రషీద్ అనే వ్యక్తులు కేరళ నుంచి ఉపాధి నిమిత్తం సౌదీ వెళ్ళారు. రంజాన్ వేడుకల కోసం తమ కుటుంబాలతో దమ్మమ్, అల్ఖోబార్ వెళ్ళారు. తిరిగి వచ్చే క్రమంలో వీరి మిత్రుడు విపిన్ వాహనం డ్రైవ్ చేస్తుండగా అదుపుతప్పి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వాహనం బోల్తాపడగా, రషీద్ భార్య షెర్లీ (30), రియాజ్ అర్థాంగి నజ్మా (31) అక్కడిక్కడే మృతి చెందారు. మిత్రులిద్దరికీ గాయాలయ్యాయి. వారి సంతానం కూడా గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.