సిండికేట్ బ్యాంకు సీఎండీ ఎస్ కె జైన్ అరెస్టు

02-08-2014 Sat 13:50

సిండికేట్ బ్యాంకు సీఎండీ ఎస్ కె జైన్ ను సీబీఐ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో ఐదుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిర్దిష్ట కంపెనీలకు రుణ సదుపాయం పెంచేందుకు జైన్ రూ.50 లక్షలు లంచంగా తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కేసు నమోదైంది. ఈ క్రమంలో వారిపై చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో బెంగళూరు, భోపాల్, ముంబయి, ఢిల్లీలోని ఇరవై ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేశారు.