ట్రాఫిక్ తో ఇబ్బంది పడిన తాబేలు!

02-08-2014 Sat 13:37

హైదరాబాదు ట్రాఫిక్ తో నగరవాసులు ఇబ్బందులు పడటం సాధారణం. కానీ, శ్రీకాకుళం జిల్లాలో 16వ జాతీయ రహదారిపై ఓ తాబేలు రోడ్డు దాటేందుకు విఫల యత్నం చేసింది. అటుగా వెళ్తున్న ఓ టీవీ ఛానల్ ప్రతినిధులు తాబేలును చూసి వీడియోలో బంధించారు. పాపం, ఆ కూర్మం రోడ్డు దాటే సమయంలో అటుగా వాహనాలు వెళుతూనే ఉన్నాయి. కానీ, ఒక్కరూ తాబేలును చూసి వాహనాన్ని ఆపిన పాపాన పోలేదు. నెమ్మదిగా రోడ్డు దాటుదామని వచ్చిన తాబేలు నాలుగైదు వాహనాలు వెళుతుండగా చూసి... ఆగి... వెళ్లింది. రోడ్డు మధ్యలోకొచ్చాక ఇక రోడ్డు దాటడం కష్టమని దానికి అర్థమైపోయింది. దాంతో, చివరకు ఆ ప్రయత్నాన్ని విరమించుకుని వెనక్కి తిరిగి వచ్చిన దారినే వెళ్లిపోయింది.