ఏటీఎంల నుంచి విత్ డ్రాపై... రూల్స్ మారుతున్నాయ్

02-08-2014 Sat 13:28

ఏటీఎంల నుంచి మీరు రెగ్యులర్ గా డబ్బులు విత్ డ్రా చేసుకుంటున్నారా? అయితే, ఇది మీ కోసమే. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు తీసుకునే విషయంలో రిజర్వ్ బ్యాంక్ కొన్ని పరిమితులు విధించింది. ఇప్పుడు ఇతర బ్యాంకుల ఏటీఎం నుంచి నెలకు ఐదు సార్లు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఆపై ప్రతి ట్రాన్సాక్షన్ కు కొంత రుసుమును బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. కాగా, ఇక నుంచి నెలకు రెండు సార్లు మాత్రమే ఇతర బ్యాంకు ఏటీఎంల నుంచి డబ్బు తీసుకునే వీలుంది. ఆపై ట్రాన్సాక్షన్ లకు మాత్రం ఛార్జీలు తప్పవు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఈ నిబంధనలు వర్తించవని బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి.