సోహ్రాబుద్దీన్ కేసులో అమిత్ షాకు నార్కో టెస్టు చేయాలని డిమాండ్

02-08-2014 Sat 12:38

సోహ్రాబుద్దీన్ షేక్ ఫేక్ ఎన్ కౌంటర్ కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు నార్కో టెస్టు నిర్వహించాలని అతని సోదరుడు రుబాబుద్దీన్ షేక్ డిమాండ్ చేస్తున్నాడు. ఈ మేరకు ప్రత్యేక సీబీఐ కోర్టులో విచారణ జరిగిన సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న షా, మరో 37 మంది నిందితులకు నార్కో నిర్ధారణ పరీక్షలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నట్లు అతని తరపున న్యాయవాది పిటిషన్ వేశారు. గతంలో ఈ కేసులో దర్యాప్తు జరుగుతున్నందున నార్కో పరీక్షకు ఒప్పుకోలేదని, ఇప్పుడు విచారణ పూర్తయింది కాబట్టి పరీక్షలకు అనుమతివ్వాలని చెప్పాడు. కాగా, ఈ కేసులో వ్యక్తిగత విచారణ నుంచి కోర్టు ముందు హాజరుకాకుండా షా గతంలోనే అనుమతి పొందారు.