నిందితుడిని ముద్దుపెట్టుకున్న కాన్పూర్ పోలీసుకు ట్రాన్స్ ఫర్!

02-08-2014 Sat 11:33

ఓ మర్డర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని ముద్దుపెట్టుకున్న కారణంగా కాన్పూర్ సర్కిల్ పోలీస్ ఆఫీసర్ ఆర్కే నాయక్ పై ఉన్నతాధికారి బదిలీ వేటు వేశారు. వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కోడలు జ్యోతి హత్య కేసులో ఆమె భర్త పియూష్ శ్యామ్ దాసానీ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతనిని విచారించేందుకు పోలీసులు స్వరూప్ నగర్ పోలీస్ స్టేషనుకు తీసుకొచ్చారు. ఆ సమయంలో "ఇకనైనా నీ బుద్ది మార్చుకుంటావా?" అని పియూష్ ను మీడియా ముందు నాయక అడగ్గా... మార్చుకుంటానని కచ్చితంగా చెప్పాడు. దాంతో, సంతోషపడ్డ నాయక్ నిందితుడిని ఆలింగనం చేసుకుని ‘గుడ్ బాయ్’ అంటూ నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. ఈ విషయం కాన్పూర్ ఐజీ అశుతోష్ పాండేకు తెలియడంతో సర్కిల్ ఆఫీసర్ ను ట్రాన్స్ ఫర్ చేశారు.