శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా వెండి పట్టివేత

02-08-2014 Sat 11:01

బంగారం, వెండి అక్రమ రవాణాకు శంషాబాద్ ఎయిర్ పోర్టు అడ్డాగా మారిపోయింది. రోజూ విదేశాల నుంచి ఇతర ప్రాంతాలకు పలువురు వీటిని తీసుకెళుతూ శంషాబాద్ లో పట్టుబడుతున్నారు. ఈ రోజు స్పైస్ జెట్ లో ఓ మహిళ డెబ్భై కిలోల వెండిని తరలిస్తుండగా ఎయిర్ పోర్టు పొలీసులు పట్టుకున్నారు. తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు.