కాసేపట్లో జిల్లా అధికారులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్

02-08-2014 Sat 10:56

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఉదయం 11.30కి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. వ్యవసాయం, అంటువ్యాధులు, ఎరువులు, విత్తనాల లభ్యత తదితర అంశాలపై ఈ సమావేశంలో అధికారులతో సమీక్షించనున్నారు.