ఈ నెల 6న జయశంకర్ జయంతి వేడుకలు

02-08-2014 Sat 08:47

ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నిర్ణయించారు. ఆగస్టు 6వ తేదీన జయశంకర్ జయంతిని జరపాలని ఇప్పటికే కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం జయశంకర్ సార్ అలుపెరుగని పోరాటం చేశారని, ఆయనను స్మరించుకోవడం తెలంగాణ ప్రజల బాధ్యత అని కేసీఆర్ అన్నారు. హైదరాబాదులో జయశంకర్ మెమోరియల్ తో పాటు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.