పోలీసులపై దొంగ నోట్ల ముఠా కత్తులతో దాడి... కానిస్టేబుల్ మృతి, ఎస్సై పరిస్థితి విషమం

02-08-2014 Sat 07:15

హైదరాబాద్ శివార్లలో దొంగ నోట్ల ముఠా బీభత్సం సృష్టించింది. ఫేక్ కరెన్సీని పట్టుకోవడానికి వెళ్లిన స్పెషల్ పార్టీ పోలీసులపై ఎదురుదాడికి దిగింది. కత్తులతో అటాక్ చేసింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ ఈశ్వర్ మృతి చెందారు. ఎస్సై వెంకటరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఈయన పరిస్థితి విషమంగా ఉంది.పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక దుండగుడు మృతి చెందగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా షామీర్ పేట మండలం మజీద్ పూర్ లో ఈ ఘటన జరిగింది.