పతనమైన కోహ్లీ, పుజారా ర్యాంకులు

02-08-2014 Sat 06:59

ఇంగ్లండ్ గడ్డమీద పేలవ ప్రదర్శనతో విసిగిస్తున్న భారత యువ బ్యాట్స్ మెన్ కోహ్లీ, పుజారాలు ఐసీసీ ర్యాంకింగ్స్ లో దిగజారారు. తాజా టెస్ట్ ర్యాంకింగ్స్ లో పుజారా ఒక మెట్టు జారి 10వ ర్యాంకుకు చేరాడు. 'లవర్ బోయ్' విరాట్ కోహ్లీ 14వ స్థానం నుంచి 15వ స్థానానికి దిగజారాడు. అయితే, సౌతాంప్టన్ టెస్టులో రెండు అర్ధ సెంచరీలతో కీలక ఇన్నింగ్స్ ఆడిన రహానె ఏకంగా తొమ్మిది స్థానాలు ఎగబాకి 26వ ర్యాంకుకు చేరాడు.బౌలింగ్ విభాగంలో జడేజా, భువనేశ్వర్ లు తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు. జడేజా 28వ స్థానం నుంచి 25వ స్థానానికి చేరగా... భువనేశ్వర్ 34వ స్థానం నుంచి 32కు చేరుకుని తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు.