ట్రైలర్ అదిరింది... అదుర్స్ 2 చేస్తాం: వివీ వినాయక్

01-08-2014 Fri 21:36

మళ్లీ ఒక హై ఓల్టేజ్ సినిమా చూసినట్టుందని ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ అభిప్రాయపడ్డారు. ‘రభస’ ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ... ‘అదుర్స్ 2’ సినిమాను చేస్తామని తెలిపారు. అయితే, ఆయన కమిట్ మెంట్స్ ముందు పూర్తి కావాలని వినాయక్ అన్నారు. ‘అదుర్స్ 2’ చేయాలంటే చాలా పరిశ్రమ చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. ఫుల్ ఎనర్జీతో ‘రభస’ ట్రైలర్ ఉందని వినాయక్ తెలిపారు. ఈ సినిమా దర్శకుడి ప్రతిభ అద్భుతమని ఆయన కొనియాడారు. సినిమా బాగుంటుందని ట్రైలర్ చూస్తేనే చెప్పవచ్చని ఆయన తెలిపారు.