: బీరు విశేషాలివి... బీరులో ఫ్యాటే లేదట!

1814లో లండన్‌లో ఓ బారీ వాట్ (బీరుని నింపి వుంచే ట్యాంక్) పగలడంతో 3,88,000 గ్యాలన్ల బీరు రోడ్డుపై ఏరులై పారింది. దీంతో ఆ ప్రాంతం మొత్తం బీరుమయమైపోయిందట. ఇక విషయానికి వస్తే, బీరు భూమి మీదే కాదు... ఆకాశంలో కూడా ఉందండోయ్. శాస్త్రవేత్తలు వెల్లడించిన వివరాల ప్రకారం అకీలా అనే నక్షత్ర కూటమిలో ఒక భారీ మేఘం ఉంది. ఆ మేఘం మిథైల్ ఆల్కహాల్ (బీరులో ఉండే ముఖ్యమైన రసాయనం)తో నిండి ఉంటుందట. ఆ మేఘంలోని మిథైల్ ఆల్కహాలుతో 400 ట్రిలియన్ ట్రిలియన్ పైంట్స్ బీరు తయారుచేయొచ్చట. బీరు తాగేవారు లావుగా ఉంటారని, బీరు తాగితే లావవుతారని మనలో అపోహలున్నాయి. అయితే బీరులో ఫ్యాట్ పర్సంటేజ్ జీరో అని తెలిపారు. కాగా, బీరుపై మందుబాబుల్లో ఉన్న ఆదరణను గమనించిన జపాన్ దేశీయులు అంతరిక్షంలో బార్లీని పండించి, ఆ గింజలతో బీరుని తయారుచేసి దానికి ‘స్పేస్ బార్లీ’ అని పేరు పెట్టి, లాటరీ ద్వారా విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నారట. అయితే అలా సమకూరిన ఆదాయాన్ని సేవా కార్యక్రమాల కోసం వినియోగించి వారి గొప్పతనాన్ని చాటుకున్నారు. బీరు వాడకంపై ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... మధ్యయుగంలో మంచినీళ్ల కన్నా బీరునే ఎక్కువగా తాగేవారట. అప్పట్లో మంచినీటిలో క్రిములు ఎక్కువగా ఉండేవట. బార్లీ కూడా భారీగానే పండేది. దీంతో బీరు తయారుచేసి నీటిలో కలిపేవారట. దీంతో బీరులోని ఆల్కహాల్ నీటిలోని క్రిములని నశింపజేసేవని, నీరు శుద్ధి కావడంతో మధ్యయుగం నాటి ప్రజలు ఈ నీటిని వాడేవారని చరిత్రకారులు చెప్పారు. ‘డాగ్‌ఫిష్ హెడ్’ అనే అమెరికన్ కంపెనీ చంద్రమండలానికి చెందిన శకలాలను సేకరించి వాటిని పొడి చేసి ‘సెలెస్ట్ - జువెల్ - ఏల్’ అనే బీరుని తయారుచేసింది. ఇప్పటికీ ఆ కంపెనీ ఆ బీరును తయారుచేసి పంపిణీ చేస్తోంది. ఖాళీ బీరు గ్లాసు చూస్తే కలిగే భయాన్ని సెనోసిల్లిసెఫోబియా అంటారు. 1922లో ఫిజిక్స్ లో ఆటమిక్ మోడల్‌ పై పరిశోధనలతో నోబెల్ ప్రైజ్ సొంతం చేసుకున్న డెన్మార్క్ శాస్త్రవేత్త నీల్స్‌బోర్‌కి ఆ దేశానికి చెందిన ఓ బీర్ కంపెనీ అద్భుతమైన బహుమతి అందజేసింది. బీర్ కంపెనీ నుండి అతని ఇంటికి బీర్ పైప్‌లైన్ వేసింది. దీంతో అతనింట్లో కుళాయి విప్పితే బీరు వచ్చేది. స్వేదానికి మద్యం పథకం కింద ప్రపంచ వింతల్లో ఒకటైన గీజా పిరమిడ్ల నిర్మాణంలో పనిచేసిన కూలీలకు జీతంగా నాలుగు లీటర్ల బీరు ఇచ్చేవారట... ఇదండీ బీరు విశేషాల కథ.

More Telugu News