మంత్రులకు గ్రేడ్లు ఇవ్వనున్న చంద్రబాబు

01-08-2014 Fri 18:19

ఆంధ్రప్రదేశ్ మంత్రుల పనితీరు ఆధారంగా గ్రేడ్లు ఇవ్వనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఈ వ్యాఖ్యలతో, పనిచేయని వారిని తొలగిస్తానని ఆయన పరోక్ష హెచ్చరికలు చేశారు. హైదరాబాదులో ఇవాళ జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం ఈ సంగతి చెప్పారు. ఏపీ మంత్రులకు మూడు గ్రేడ్లు ఇవ్వనున్నట్లు తెలిసింది. బాగా పనిచేసేవారు, ఓ మాదిరిగా పనితీరు ఉన్న వారు, పని చేయని వారు... ఇలా మూడు గ్రేడ్లను చంద్రబాబు ఇవ్వనున్నారు.