: ఫేస్ బుక్ ఆ తండ్రికి తగిన శాస్తి చేసింది

ఏదైనా ఓ పని చేయడం... దానిని ఫొటో తీయడం... పెద్ద ఘనకార్యం చేసినట్టు ఫేస్ బుక్ లో ఆ ఫోటో పెట్టడం అన్నది ఇప్పుడు యువతకు బాగా అలవాటైపోయింది. ఫేస్ బుక్ వ్యసనంగా మారిన ఫ్రాన్స్ కు చెందిన ఓ వ్యక్తి నెల రోజుల వయసున్న తన కుమార్తెను కొట్టాడు. తర్వాత తానేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు, చిన్నారి గాయాలను చూపుతూ ఫోటోలు తీసి ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. అతడి వ్యవహార శైలిపై ఆగ్రహించిన అతని మిత్రుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆ చిన్నారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. చిన్నారిని కొడుతున్న సమయంలో తల్లి అక్కడే ఉండడం విశేషం. గుక్క తిప్పుకోకుండా ఏడుస్తుండడంతో తట్టుకోలేక కొట్టానని సదరు తండ్రి పోలీసులకు తెలపగా, కొట్టవద్దని చెబితే తనను ఎక్కడ వదిలేస్తాడోననే భయంతో మౌనంగా ఉన్నానని తల్లి వివరించింది. గాయాలపాలైన చిన్నారి అస్వస్థతకు గురైంది.

More Telugu News