'న్యాక్'కు డైరెక్టర్లను నియమించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు

01-08-2014 Fri 17:51

హైదరాబాద్ కొండాపూర్ లో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ (న్యాక్)కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు డైరెక్టర్లను నియమించాయి. ఈ రెండు ప్రభుత్వాలు న్యాక్ కు చెరో డైరెక్టరును నియమిస్తూ ఆదేశాలు జారీ చేశాయి. ఇవాళ (శుక్రవారం) ఐఏఎస్ అధికారి శ్యాంబాబు బాధ్యతలు చేపట్టేందుకు న్యాక్ కార్యాలయానికి వచ్చారు. అయితే, ఆయనకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ‘శ్యాంబాబు గో బ్యాక్’ అంటూ వారు నినాదాలు చేశారు. దీంతో, ఆయన పోలీసుల సూచన మేరకు తిరిగి వెళ్లిపోయారు.