సెప్టెంబర్ 3న కోర్టు ముందు హాజరుకావాలని నిత్యానందకు ఆదేశం

01-08-2014 Fri 17:36

వివాదాస్పద నిత్యానంద స్వామికి కోయంబత్తూరులోని కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ మూడవ తేదీన తమ ముందు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. 2011లో చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిత్యానంద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ హిందూ మక్కల్ కట్చి అధ్యక్షుడు అర్జున్ సంపత్ పరువు నష్టం దావా కేసు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు పై విధంగా చర్యలు తీసుకుంది.