ప్రధాని, తమిళనాడు సీఎంకు లంక రక్షణ శాఖ క్షమాపణలు

01-08-2014 Fri 17:12

భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు శ్రీలంక రక్షణ శాఖ బేషరతు క్షమాపణలు చెప్పింది. ప్రధానికి జయలలిత రాసిన లేఖను లంక ప్రభుత్వం వెబ్ సైట్లో పెట్టింది. దానిపై కొన్ని కామెంట్లు కూడా వచ్చాయి. ఈ విషయం వివాదాస్పదం కావడంతో వెంటనే జయకు సంబంధించిన వ్యాఖ్యలు, ఫోటోలను లంక రక్షణ శాఖ వెబ్ సైట్ నుంచి తొలగించింది. క్షమాపణలు తెలిపింది.