ఓయూలో తొమ్మిదోరోజు కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన

01-08-2014 Fri 16:47

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన తొమ్మిదోరోజూ కొనసాగుతోంది. ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంపై వర్శిటీ విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం వైఖరిని వ్యతిరేకిస్తూ ఓయూ ప్రాంగణంలో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వ దిష్టిబొమ్మలను విద్యార్థులు దగ్ధం చేశారు.