ap7am logo

'D/O రామ్ గోపాల్ వర్మ'పై అభ్యంతరం

Tue, Jan 22, 2013
        చూస్తుంటే 'D/O రామ్ గోపాల్ వర్మ'
సినిమా టైటిల్ ను మార్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వెన్నెల కిషోర్ హీరోగా ఈ సినిమాను దర్శకుడు ఖాజా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల సెన్సార్ కి వెళ్లిన ఈ
సినిమా టైటిల్ విషయంలో అక్కడ అభ్యంతరాలను ఎదుర్కుంది. రామ్ గోపాల్ వర్మ
పేరు పెట్టడం వివాదాలకి దారి తీసే అవకాశం వుంది కాబట్టి, ఆ టైటిల్ ను
మార్చుకోమంటూ సెన్సార్ సభ్యులు సూచించారు.

       దాంతో ఈ సినిమా పేరును 'D/O వర్మ
'గా మార్చే దిశగా దర్శక నిర్మాతలు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ
సినిమాలో రామ్ గోపాల్ వర్మకి సంబంధించిన ఏ అంశాన్ని టచ్ చేయలేదనీ, ఆయనకీ ఈ
సినిమాకి ఎలాంటి సంబంధం లేదని గతంలోనే దర్శకుడు ఖాజా చెప్పాడు. ఇప్పుడు అదే
కారణం ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ పొందడానికి అడ్డుపడింది. ఈ నేపథ్యంలో
ఈ సినిమా 'D/0 వర్మ' పేరుతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Related News
Movie News (Latest)