ap7am logo

'రవివర్మ' గీసిన కథానాయికలు

Tue, Jul 24, 2012
'రవివర్మ'లో సంతోష్ మీనన్, నిత్యా మీనన్
'రవివర్మ'లో సంతోష్ మీనన్, నిత్యా మీనన్
      మలయాళంలో క్లాసికల్ రొమాంటిక్ టచ్
తో రూపొందిన 'మకరమంజ' అనే చిత్రం, తెలుగులో 'రవివర్మ' అనే పేరుతో
ప్రేక్షకుల ముందుకి రానుంది. ఎస్వీఆర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వారు అందిస్తోన్న
ఈ సినిమాలో ప్రధాన పాత్రని సంతోష్ మీనన్ పోషించగా, నాయికలుగా
కార్తిక ... నిత్యా మీనన్ ... మల్లికా కపూర్ నటించారు.

      కథ ప్రకారం
... రాజా రవివర్మ గొప్ప చిత్రకారుడు. ఆయన గీసిన ప్రతి కళాఖండం వెనుక ఓ
కాన్సెప్ట్ ఉంటుంది. అలాంటి రవివర్మ తను గీయబోయే చిత్రం తాలూకు పాత్ర
ఎదురుగా ఉన్నప్పుడే తన కుంచెకి పని చెబుతాడు. ఈ నేపథ్యంలో అతను ఊర్వశీ
పురూరవుల చిత్రాన్ని గీయాలని అనుకుంటాడు. అందుకోసం ఓ అందమైన యువతి (
కార్తిక ) ని ఊర్వశిగా తనముందు నిలుపుతాడు. తనని తాను పురూరవుడిగా
ఊహించుకుంటాడు.

     ఇక ఆ తరువాత చోటు చేసుకునే పరిణామాలతో కథ ఆసక్తికరంగా
కొనసాగుతుంది. మనసుని హత్తుకునే ఈ సన్నివేశాలను దర్శకుడు లెనిన్ రాజేంద్ర
అద్భుతంగా తెర కెక్కించాడని నిర్మాత శోభారాణి చెప్పింది. ఇప్పటికే పాటల
రికార్డింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, త్వరలోనే ప్రేక్షకుల ముందుకి
వస్తుందనీ ... తప్పక విజయాన్ని సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.   
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Related News
Movie News (Latest)