ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'బిల్లా-2' కి పెరుగుతున్న మార్కెట్

Fri, Jan 20, 2012
       తమిళ హీరో అజిత్ మార్కెట్ అంతకంతకు పెరుగుతోంది. అతని సినిమాలకు తమిళనాడులోనే కాకుండా విదేశీ మార్కెట్ కూడా బాగా పలుకుతోంది. తాజాగా ఆయన నటిస్తున్న 'బిల్లా-2' సినిమాకు సంబంధించి ఇటీవల జరిగిన ఓవర్సీస్ బిజినెస్సే అందుకు నిదర్శనం. ఈ సినిమా విదేశీ హక్కులు మిలియన్ డాలర్లకు (సుమారు ఐదు కోట్లు) అమ్ముడుపోయాయట. విదేశాలలో తమిళ సినిమాలను పంపిణీ చేసే జి.కె. మీడియా సంస్థ ఈ రేటుకి 'బిల్లా-2' కమిట్ అయింది. మామూలుగా రజనీకాంత్, కమలహాసన్, విజయ్, సూర్య చిత్రాలకు ఇలా ఓవర్సీస్ రైట్స్ మిలియన్ డాలర్లకు అమ్ముడుపోతుంటాయి. ఇప్పుడీ చిత్రంతో ఈ జాబితాలో అజిత్ కూడా చేరాడు. చక్రి తోలేటి దర్శకత్వంలో రూపొందుతున్న 'బిల్లా-2' సినిమాలో హ్యుమా ఖురేషి, బ్రూనా అబ్దుల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 67.225.212.107
Related News
Movie News (Latest)