ap7am logo

నీతూ చంద్ర నిలదొక్కుకున్నట్టే!

Thu, Dec 03, 2015
నీతూ చంద్ర
నీతూ చంద్ర
నీతూ చంద్ర నిర్మాతగా నిలదొక్కుకున్నట్టేననే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. సినిమా బిజినెస్ అనుకున్నంత తేలిక కాదు. అలాంటి బిజినెస్ లో అడుగుపెట్టిన నీతూ చంద్ర నిర్మాతగా మరో సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో వుంది. బాలీవుడ్లో మంచి నటిగా నీతూ చంద్ర మార్కులు కొట్టేసింది. తెలుగులో గోదావరి .. సత్యమేవ జయతే సినిమాల ద్వారా ఇక్కడి ప్రేక్షకులను అలరించింది. అడపాదడపా తమిళ సినిమాల్లో మెరుస్తూనే వుంది.

అలాంటి నీతూ చంద్ర .. గతంలో 'దేశ్వా' .. 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ బీహార్' చిత్రాలను నిర్మించింది. ఈ సినిమాలతో నిర్మాతగా ఆమెకి అభినందనలు దక్కాయి. దాంతో ఆమె మరో సినిమాను ప్లాన్ చేసుకుంది. తన సోదరుడి దర్శకత్వంలో 'మిథిలియా మక్కాన్' సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే యూఎస్ .. కెనడా .. నేపాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా, తాజా షెడ్యూల్ ను ముంబైలో జరుపుకోనుంది. ఈ సినిమా తనకి పేరుతో పాటు మంచి వసూళ్లను కూడా తెచ్చి పెడుతుందని నీతూ చంద్ర భావిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Related News
Movie News (Latest)