ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇది వర్మ లాభాల స్టోరీ!

Tue, Jul 15, 2014
రాంగోపాల్ వర్మ
రాంగోపాల్ వర్మ
ఈ రోజుల్లో ఎంత చిన్న సినిమా తీయాలన్నా కోట్లుండాల్సిందే.

అలాంటి పరిస్థితుల్లో రాంగోపాల్ వర్మ కేవలం 2 లక్షల 11 వేల 8 వందల 32 రూపాయలతో సినిమా తీసేశాడట.

అదే ఇటీవలే రిలీజయిన 'ఐస్ క్రీమ్' సినిమా!

ఈ రహస్యాన్ని వర్మ తాజాగా ఓ ప్రకటన ద్వారా బయటపెట్టాడు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే....


"సినిమా అనేది కథ, పెర్ఫార్మన్సెస్ టేకింగ్, సౌండ్, కెమెరా, మ్యూజిక్ ల సమ్మేళనం. ఆ సమ్మేళనం సాదించటానికి యాక్టర్లు, టెక్నీషియన్లతో పాటు వివిధ రకాల ఎక్విప్మెంట్లు అవసరమవుతాయి. సినిమాకి ఖర్చు అనేది యాక్టర్లకి టెక్నీషియన్లకి పేమెంట్ల మూలాన, ఎక్విప్మెంట్లకి లొకేషన్లకి వగైరాలకి ఇచ్చిన రెంట్లు మూలాన...నేను సినిమా మొదట్లోనే యాక్టర్లు, టెక్నీషియన్లు, ఎక్విప్మెంట్ సప్లయర్లు, వగైరా అందరితో మీటింగ్ పెట్టి "మీకు సినిమా ఆడుతుందని నమ్మకం లేకుండా కేవలం మీకు దొరికే పేమెంట్ కోసం చేస్తున్నారా? లేక మీకు కాన్సెప్ట్ నచ్చి ఆడుతుందనే నమ్మకంతోచేస్తున్నారా?” అని అడిగాను.


దానికి అందరూ 'నమ్మకంతోనే' అని చెప్పారు. అప్పుడు నేను వాళ్ల పేమెంట్ లు సినిమా హిట్ అయితేనే వస్తాయని చెప్పాను. ఒప్పుకోని వాళ్ళని వొదిలేసి వేరే ఒప్పుకునే వాళ్లని వెతికి పెట్టుకోవటం జరిగింది. నేను వాళ్ళందరికీ చెప్పిందేంటంటే వాళ్లు మామూలుగా ఏం ఛార్జ్ చేస్తారో దానికన్నా ఎక్కువ ఇస్తామని. కానీ, ఆ పేమెంట్ లాభాల నుంచి వస్తుంది. అంతే కాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి కాదు.


సినిమాకి లాభమొచ్చిందంటే వాళ్లు చేసిన పని సఫలమయిందని అర్ధం. ఫెయిల్ అయ్యిందంటే వాళ్ల పని విఫలమయిందని. అలా అయితే వాళ్ల వల్ల విఫలమైన పనులకి వాళ్ల జేబుల్లోకి డబ్బులెళ్లి, వాళ్ల పనితనాన్ని నమ్మిన ప్రొడ్యూసర్ కి, కొన్న డిస్ట్రిబ్యూటర్ కి మాత్రమే నష్టం ఎందుకు రావాలన్న కాన్సెప్ట్ లో నుంచి వచ్చిందీ thought process.


'ఐస్ క్రీం' సినిమాలో లైట్లు, ట్రాక్ ట్రాలీలు, జిమ్మీ జిబ్ లు, స్టడీ క్యా౦లు ఏమీ వాడలేదు. 70% సినిమా గింబల్ అనే ముందు చెప్పిన వాటన్నిటికంటే చాలా చీపయిన పరికరంతో తియ్యడం జరిగింది. అందుకే విజువల్స్ అంత కొత్తగా ఉన్నాయి. ఇంకా ఫ్లో-క్యా౦ పద్దతిలో సినిమా తియ్యడం మూలాన యూనిట్ లో పని చేసే వాళ్ల సంఖ్య రెగ్యులర్ సినిమా కన్నా 90 శాతం తగ్గిపోయింది. షూటింగప్పుడు అందరూ బ్రేక్ ఫాస్ట్ ఇంట్లోనే తినేసి వచ్చేవాళ్లు. లంచ్ ఎవరికి వాళ్లు వాళ్లే తెచ్చుకునేవాళ్లు. నవదీప్, తేజస్విలు సినిమాకోసం వేసుకున్న బట్టలు వాళ్ల సొంత బట్టలు!


స్టార్లు, పాటలు, ఫైట్లు, కామెడీ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేకుండా, ఒకే ఒక్క లొకేషన్లో ఇద్దరే ఇద్దరు యాక్టర్లతో తీసిన 'ఐస్ క్రీం'కి ఇంత సూపర్ ఓపెనింగ్స్ ఎందుకొచ్చాయి? అనే ప్రశ్నకి ఒకరిచ్చిన సమాధానం, 'రాం గోపాల్ వర్మ పేరుండడం' అని. కానీ అది కరెక్ట్ కాదు.
ఎందుకంటే, నా పేరుతోనే ఓపెనింగ్ వస్తే మరి 'సత్య 2' కెందుకు రాలేదు.? అసలు కారణం చాలా సింపుల్. వాళ్లకి 'సత్య 2' ట్రైలర్లు, దానికి సంబంధించిన ప్రచారం నచ్చలేదు, ఐస్ క్రీంవి నచ్చాయి.... కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఐస్ క్రీం కి వచ్చిన ఓపెనింగ్ ఏం ప్రూవ్ చేసిందంటే ఆడియన్స్ ని థియేటర్లోకి అట్రాక్ట్ చెయ్యడానికి ప్రొడక్షన్ వాల్యూస్ అవసరంలేదని... కేవలం ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా చాలని... పైసా ఖర్చు లేనిది ఐడియా మాత్రమే.
నేను చెప్పేదానికి చివరర్ధం ఏమిటంటే, ఐడియా ఉన్నవాడెవ్వడైనా సరే ఆ ఐడియాతో మిగతా వాళ్ళని కన్విన్స్ చెయ్యగలిగితే ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా సినిమా తీసేయ్యొచ్చు.


నేను పైన చెప్పిన 2 లక్షల 11 వేల 8 వందల 32 రూపాయిల ఖర్చు ముఖ్యంగా ఆ ఇంటి రెంట్ కి, టీలకి, కాఫీలకి అయ్యింది. ఆ ఇంటి ఓనర్ సినిమా టీం లో భాగం కాదు కనక ఆ రెంట్ ఖర్చు తప్పలేదు. కానీ, గుడ్ న్యూస్ ఏంటంటే నేను ఐస్ క్రీం లో ఆ ఇంటిని ప్రెజెంట్ చేసిన విధానం నచ్చి, త్వరలో నేను చేయబోయే 'ఐస్ క్రీం 2' సినిమాకి ఆ లొకేషన్ ఓనర్ 'ఐస్ క్రీం 2' సినిమా టీంలో తను కూడా భాగమవ్వడానికి ఒప్పుకున్నారు..


ఐస్ క్రీం సూపర్ హిట్ అయ్యి లాభమొచ్చిన మూలాన 15 వ తారీకున 'ఐస్ క్రీం' సక్సెస్ మీట్ లో నిర్మాత రామ సత్యనారాయణ గారు పని చేసిన అందరికీ వాళ్ల వాళ్ల పేమెంట్ లు అందజేస్తారు.


ఐస్ క్రీం ఎలా తయారయ్యిందో ఒక సహకార సంఘం దృష్టితో అర్ధం చేసుకుంటే ఒక సరికొత్త ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ లోనే కాదు ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ఉన్న ప్రతీఊర్లో పుడుతుంది.
-రాం గోపాల్ వర్మ
X

Feedback Form

Your IP address: 67.225.212.107
Related News
Movie News (Latest)